కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి

దిశ ప్రతినిధి, మెదక్: కొండపోచమ్మ సాగర్ కుడికాలువకు గండి పడింది. సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడి గోదారి జలాలు గ్రామంలోకి చేరాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు, కూరగాయల తోటలు నిటితో నిండిపోయాయి. గ్రామంలోకి చేరిన నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలేత్తాయి. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో అధికారులు నీటిని నిలిపి వేసిశారు.

Advertisement