- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కేటీఆర్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం బుద్ధభవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారని, తొలిదశ తెలంగాణ విముక్తి ఉద్యమంలో వలస పాలనపై తీవ్ర నిరసన తెలిపి 1969లో మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story