మూవీ రిలీజ్‌పై ‘నిశ్శబ్దం’ వీడిన కోన..

by Shyam |
మూవీ రిలీజ్‌పై ‘నిశ్శబ్దం’ వీడిన కోన..
X

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క(స్వీటీ).. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమైంది. బాహుబలికి ముందు అరుంధతి, తర్వాత ‘భాగమతి’ లాంటి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన స్వీటీ నెక్స్ట్ మూవీ.. ‘నిశ్శబ్దం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు కరోనా ఎఫెక్ట్‌తో సినిమా హాళ్లు మూత పడగా.. ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. కాగా దీనిపై ఈ చిత్ర నిర్మాత కోన వెంకట్ క్లారిటీనిచ్చారు.

‘నిశ్శబ్దం’ విడుదలపై మీడియాలో చాలా వార్తలొస్తుండటంతో దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్న కోన వెంకట్.. ‘మా సినిమాను వెండితెరపై రిలీజ్ చేసేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ పరిస్థితులు చక్కబడకపోతే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంచుకుంటాం’ అని తెలిపారు. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరో మాధవన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story