సీఎం అంటే జగన్‌లా ఉండాలి.. కోమటిరెడ్డి ఆసక్తికర కామెంట్స్

by srinivas |   ( Updated:2021-04-26 06:23:48.0  )
సీఎం అంటే జగన్‌లా ఉండాలి.. కోమటిరెడ్డి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే జగన్‌లా ఉండాలని వ్యాఖ్యానించారు. కరోనా చికిత్సను కూడా జగన్ ఆరోగ్యశ్రీలోకి తెచ్చారని, వెయ్యి దాటిన అన్ని చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడం మంచి నిర్ణయమని ప్రశంసలు కురిపించారు.

తెలంగాణలో కరోనా రోగులు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారని, అయినా ఆరోగ్యశ్రీ కిందకు ఎందుకు తీసుకురాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కాగా జగన్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించడం ఇది తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed