- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తన కలలో ఏం కనిపిస్తోందో చెప్పిన కోమటిరెడ్డి!
దిశ, నల్లగొండ: రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 10వ వర్థంతి సందర్భంగా కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని డీఐజీ రంగనాథ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి రక్తదానం చేసి, విలేకర్లతో మాట్లాడారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జిల్లాకేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేయించారని, రూ.10 కోట్లతో కాలేజీని కట్టించారని అన్నారు. ఉపాధి శిక్షణ ద్వారా రెండువేల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ప్రతీక్ రెడ్డి కాలేజీలో ఎంతో అనుభవం గల లెక్చరర్లతో బోధన జరుగుతోందని, మహిళా కళాశాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
శిథిలావస్థకు చేరుకున్న ఎన్జీ కాలేజీ నూతన భవనాన్ని, ప్రభుత్వ అనుమతితో నిర్మిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి నల్లగొండను ఎంతో అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా కోమటి రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ అంటే తనకు ప్రాణమని, కలలో కూడా ఆ పేరే వస్తుందని చెప్పారు. వెంటిలేటర్ కలిగి ఉన్న అంబులెన్స్‌లతో తెలంగాణ బార్డర్ వరకు సేవలు అందిస్తాయని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు.