కొల్లాపూర్ ఎంపీపీ రాజీనామా..!

by  |
కొల్లాపూర్ ఎంపీపీ రాజీనామా..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తన వ్యక్తిగత ఇబ్బందులను కారణంగా పేర్కొంటూ కొల్లాపూర్ ఎంపీపీ తన పదవికి రాజీనామా చేశారు. నాగర్‎కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ (టీఆర్ఎస్) సుధారాణి.. బుధవారం తన పదవి రాజీనామా పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మాను చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తన భర్త మరణించడంతో పాటు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పుకొచ్చారు. తన కుటుంబ బాధ్యతల నిర్వహణకు వీలు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుధారాణి తెలిపారు.



Next Story