- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా vs బెంగళూరు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో 2020లో భాగంగా నేడు మరో సరవత్తర పోరు జరుగనుంది. అబుదాబి వేదికగా రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు అంచనాలను మించి రాణిస్తున్నది. ఏబీ డివిలియర్స్, కోహ్లీ రాణిస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా మారింది. నవదీప్ సైనీతో పాటు చాహల్ వికెట్లు తీస్తుండటం జట్టుకు కలసి వస్తున్నది. ఆరోన్ ఫించ్ కూడా పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరం ఉన్నది.
కాగా కోల్‌కతా జట్టు మొదట్లో వెనుకబడినా ప్రస్తుతం ప్లేఆఫ్ రేసులోనే ఉన్నది. కెప్టెన్సీ మార్పు పెద్దగా ప్రభావం లేకపోయినా దినేశ్ కార్తీక్ బ్యాటింగ్లో రాణిస్తుండటం కలసి వస్తున్నది. ఆండ్రీ రస్సెల్, సునిల్ నరైన్ అంచనాలను అందుకుంటే జట్టుకు తిరుగు ఉండదు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.
Next Story