- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోల్‌కతా చెత్త ఇన్నింగ్స్ 84/8
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో రెండోసారి చెత్త రికార్డును నెలకొల్పింది. 2008లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 67/10 పరుగుల చెత్త రికార్డును నెలకొల్పిన కోల్‌కతా సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఒక్క పరుగు మాత్రమే చేయడంతో కోల్‌కతా అతి స్వల్ప స్కోరును చవిచూసింది.
కోల్‌కతా ఇన్నింగ్స్:
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్, వన్‌డౌన్ ఆటగాళ్లకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్లు తీయడం మొదలుపెట్టారు. దీంతో కోల్‌కతా తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ నేపథ్యంలోనే తొలి వికెట్ రాహుల్ త్రిపాఠితోనే మొదలైంది. 3 పరుగుల వద్ద రెండో ఓవర్ వేస్తున్న మహ్మద్ సిరాజ్ రాహుల్ త్రిపాఠి(1) క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే నితీష్ రానాను (0)డకౌట్ చేశాడు. వీరిద్దరి వికెట్ కోల్పోయిన తర్వాతి ఓవర్ నవదీప్ సైని వేశాడు. ఈ ఓవర్ రెండో బంతికే శుబ్ మన్ గిల్ కూడా(1) అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 3 పరుగులకే కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి ఊహించని ఊబిలో పడింది.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన టామ్ బెంటన్(10), దినేష్ కార్తీక్(4), ప్యాట్ కమ్మిన్స్(4) పరుగులకే వికెట్లను సమర్పించారు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా కేవలం 40 పరుగులే చేసింది. ఇక 5వ స్థానంలో వచ్చిన కెప్టెన్ మోర్గాన్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయంత్నం చేశాడు. కానీ అది ఫలించలేదు. బౌలర్లు పోటీ పడుతూ మేడ్ ఇన్ ఓవర్లు.. వికెట్లు తీయసాగారు. ఈ తరుణంలోనే మోర్గాన్(30) కూడా 57 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కుల్దీప్ యాదవ్ (12), లాకి ఫెర్గూసన్(19*) నాటౌట్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మెన్ల విఫలంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ మాత్రం 84 పరుగుల వద్ద ఆగిపోయింది.
బెంగళూరులో టోలిచౌకి కిల్లింగ్ బౌలర్:
బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్‌లో హైదరాబాద్ టోలీచౌకికి చెందిన మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ చరిత్రలోనే నూతన రికార్డుకు నాంది పలికాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్.. మొదటి పరుగు ఇచ్చే ముందు ఏకంగా 3 వికెట్లు తీశాడు. ఇదే సమయంలో కంటిన్యూగా రెండు మేడ్ ఇన్ ఓవర్లు(12 డాట్ బాళ్లు) వేశాడు. దీనికి తోడు 4 ఓవర్లలో మొత్తం 8 పరుగులు మాత్రమే ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇతనికి తోడు వాషింగ్గన్ సుందర్ కూడా మంచి బౌలింగ్ కనబరిచాడు. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో యూజువేంద్ర చాహల్ సైతం మాయ చేశాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు చక్కగా రాణించడంతో కోల్‌కతా 84 పరుగులకే తోకముడిచింది. కాగా, ఒకే ఇన్నింగ్స్‌లో బెంగళూరు బౌలర్లు నాలుగు మేడ్ ఇన్ ఓవర్లు ఇవ్వడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.
స్కోరు బోర్డు:
Kolkata Knight Riders Innings84-8 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c క్రిస్ మోరిస్ b నవదీప్ సైని 1(6)
2. రాహుల్ త్రిపాఠి c డివిలియర్స్ b సిరాజ్ 1(5)
3. నితీష్ రానా b సిరాజ్ 0(1)
4. టామ్ బెంటన్ c డివిలియర్స్ b సిరాజ్ 1(0)
5.దినేశ్ కార్తీక్ (wk)lbw b చాహల్ 4(14)
6. ఇయాన్ మోర్గాన్ (c)c గురుకీరత్ సింగ్ b వాషింగ్టన్ సుందర్ 30(34)
7. ప్యాట్ కమ్మిన్స్ c పడిక్కల్ b చాహల్ 4(17)
8. కుల్దీప్ యాదవ్ నాటౌట్ రనౌట్ (గురుకీరత్ సింగ్ /క్రిస్ మోరిస్)12(19)
9. లాకి ఫెర్గూసన్ నాటౌట్ నాటౌట్ 19(16)
ఎక్స్‌ట్రాలు: 3
మొత్తం స్కోరు: 84-5
వికెట్ల పతనం: 3-1 ( రాహుల్ త్రిపాఠి, 1.3), 3-2 (నితీష్ రానా, 1.4), 3-3 (శుబ్‌మన్ గిల్, 2.2), 14-4 (టామ్ బెంటన్, 3.3), 32-5 (దినేశ్ కార్తీక్ , 8.4), 40-6 (ప్యాట్ కమ్మిన్స్, 12.3), 57-7 (ఇయాన్ మోర్గాన్, 15.4), 84-8 (కుల్దీప్ యాదవ్, 20)
బౌలింగ్:
1. క్రిస్ మోరిస్ 4-1-16-0
2. మహ్మద్ సిరాజ్ 4-2-8-3
3. నవదీప్ సైని 3-0-23-1
4. ఇసురు ఉదాన 1-0-6-0
5. యూజువేంద్ర చాహల్ 4-0-15-2
6. వాషింగ్టన్ సుందర్ 4-1-14-1