ఆర్సీబీ వర్చువల్ మీటింగ్‌లో కోహ్లీ వార్నింగ్

by Shyam |
ఆర్సీబీ వర్చువల్ మీటింగ్‌లో కోహ్లీ వార్నింగ్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో దుబాయ్ వేదికగా బయో సెక్యూర్ గ్రౌండ్లలో ‘ఇండియన్ ప్రీమీయర్ లీగ్’ (IPL) త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జట్లన్నీ యూఏఈ చేరుకున్నాయి. ఈ క్రమంలో ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’ (RCB) సోమవారం వర్చువల్ మీటింగ్ (Virtual meeting) నిర్వహించింది.

ఈ మీటింగ్‌లో ఆర్సీబీ (RCB) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం టోర్నమెంట్‌పై ప్రభావం చూపుతుందని తోటి ఆటగాళ్లను హెచ్చరించాడు. కావునా, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, బయో బబుల్‌‌ను సురక్షితంగా ఉంచేందుకు చేయగలిగిందంతా చేయాలని సూచించాడు.

ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్‌తో పాటు హెడ్ కోచ్ సిమన్ కటిచ్‌లు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లు ఏడు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుందని మైక్ హెస్సన్ తెలిపాడు. ఆ తర్వాత కూడా కరోనా నెగిటివ్ వస్తేనే జట్టులోని ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశాడు. కాగా, వచ్చే నెల 19నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed