- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాప్ టెన్‌లోకి అండర్సన్
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌తో ముగిసిన మూడో టెస్టులో ఏడు వికెట్లు తీయడమే కాకుండా తన కెరీర్‌లో 600 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. పాకిస్తాన్-ఇంగ్లాండ్ చివరి టెస్టు అనంతరం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను సవరించింది. బౌలింగ్ విభాగంలో అండర్సన్ 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. గతంలో టాప్ ర్యాంకులో ఉన్న అండర్సన్ చాలా కాలంగా టాప్ 10 కంటే దిగువనే ఉంటున్నాడు. తాజాగా అతని ప్రదర్శనతో ఆరు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ టాప్ పొజిషన్లో ఉండగా బూమ్రా ఒక స్థానం పడిపోయి 9వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక చివరి టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న జాక్ క్రాలీ ఏకంగా 53 స్థానాలు మెరుగుపరుచుకొని 28వ ర్యాంకుకు చేరుకున్నాడు.
వన్డేల్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు తమ టాప్ ర్యాంకులు నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బ్యాటింగ్ విభాగంలో తొలి రెండు స్టానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజమ్ మూడో స్థానంలో ఉండగా రాస్ టేలర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో న్యూజీలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్ర ర్యాంకులో ఉండగా, జస్ప్రీత్ బూమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ ముజీబుర్ రహమాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.