అరుదైన నాయకుల్లో కోడెల ఒకరు

దిశ, ఏపీ బ్యూరో: అరుదైన నాయకుల్లో కోడెల శివప్రసాదరావు ఒకరని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ ఆఫీస్‌లో కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కాల్వ శ్రీనివాసులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయి డాక్టర్‌‌గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పల్నాడు రాజకీయాలను మూడున్నర దశాబ్ధాలుగా శాసించారని… ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారని తెలిపారు. కీలక సమయాల్లో కోడెల పాత్ర అద్వితీయమని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

Advertisement