రేపు కార్యాచరణ ప్రకటిస్తాం: కోదండరాం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ప్రొఫెసర్ కోదండం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారని, వెంటనే తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఆగస్టు 15న ప్రసంగంలో కేసీఆర్ కరోనా ఉచిత వైద్యంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో ఆందోళనలు చేపడతామని, రేపు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Advertisement