- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టు రఘుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి భేషరతుగా అతనిని విడుదల చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. రామంతపూర్ లోని రఘు నివాసంలో ఆయన భార్య ప్రవీణాను కలిసిన టీజేఎస్ నాయకులు ఆమెకు ధైర్యం చెప్పారు. రఘు కుటుంబానికి టీజేఎస్ అండగా ఉంటుందని, ఆయన విడుదల కోసం కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రశ్నించే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిందని, వాటన్నిటిని ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలిసి రావాలని ఆయన కోరారు. రఘు అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలంటూ పలువురు ప్రముఖుల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్ర డీజీపీకి మెయిల్ చేశారు. సంతకాలు చేసిన వారిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, రమా మెల్కోటే, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, ఆర్.అఖిలేశ్వరి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఉన్నారు.
హైకోర్టు సీజేకు లేఖ రాసిన ప్రవీణ
తన భర్తకు, కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ జర్నలిస్టు రఘు భార్య ప్రవీణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి గురువారం లేఖ రాశారు. రఘును కిడ్నాపర్లలా ఎత్తుకెళ్లారని, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని లేఖలో గుర్తు చేశారు. దుండగుల్లా ఎత్తుకెళ్లారని, వీడియోలు బయటకు వచ్చాక అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించడం అనుమానంగా ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, భూ కబ్జాదారులు రఘును హత్య చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకొని తన భర్తను రక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు.