ఈటలతో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

by Anukaran |   ( Updated:2021-05-27 00:54:36.0  )
ఈటలతో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ పుట్టిస్తోంది. ఈటల విషయం రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల నివాసానికి ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. ఈటలతో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌పై జరిగిన దాడిని ఆత్మ గౌవర దాడిగా పరిగణిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా సరే కేసీఆర్ నీడనే బ్రతకాలి అని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఉంటే ఓ సారి చర్చించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను పాటించే పరిస్థితిలో కేసీఆర్‌ లేడని కోదండరామ్ ఆరోపించారు. ఈటల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో భాగంగానే మేము సమావేశం అయ్యామని తెలిపారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఇంకా ఈటలను ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు కదా అని అన్నారు. ఇవేవీ చేయడానికి కేసీఆర్‌కు ధైర్యం లేదా? అని అడిగారు. ఈ సందర్భంగా ఈటలకు మేమంతా మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

నిన్నటి నుంచి ఈటల బీజేపీలో చేరుతారనే వార్త చక్కర్లు కొడుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధానత్యను సంతరించుకుంది. అయితే బీజేపీలో చేరిక విషయంపై ఈటల ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed