వ్యక్తిగత వైరం.. కత్తులతో దూసుకున్న వైనం

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులు ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా కత్తులు దూసుకున్నారు.

ఈ గొడవలో ఆర్ఎంపీ డాక్టర్ నవాస్ కుమారుడికి కత్తిపోట్లు పడగా, తీవ్ర రక్తస్రావం అయ్యింది. సత్తార్ అనే మరో వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి వ్యక్తిగత గొడవలే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement