వృద్ధి స్థిరత్వంపై స్పష్టతకు మరో త్రైమాసికం : బిర్లా

by Shamantha N |
వృద్ధి స్థిరత్వంపై స్పష్టతకు మరో త్రైమాసికం : బిర్లా
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాదిలో దేశీయ మార్కెట్లు, ఆర్థికవ్యవస్థ ఊహించని పరిణామాలను చోటు చేసుకున్నాయి. కమొడిటీల నుంచి ఈక్విటీ మార్కెట్ల వరకు ప్రతి విభాగం కరోనా వల్ల అనూహ్యమైన గరిష్ఠాలను, దారుణ పతనాలను చూశాయని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తన వార్షిక నివేదికలో చెప్పారు. ఏదేమైనప్పటికీ దూకుడుగా ఉన్న ఫైనాన్స్ మార్కెట్లు ఎంతమేరకు ఇదే ధోరణిని కొనసాగిస్తాయనేది ప్రస్తుతానికి అంచనా వేయలేమన్నారు. ఇప్పుడున్న ర్యాలీ, వృద్ధి ఏ మేరకు స్థిరంగా ఉంటుందనేది తెలియాలంటే మరో త్రైమాసికం వేచి ఉండాలన్నారు. గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా చాలావరకు నష్టం ఏర్పడిన్నారు.

అయితే, సంక్షోభ పరిస్థితుల నుంచే అవసరమైన నిల్వలు, ఆలోచనలను సాధించాలన్నారు. ఇదే సమయంలో ఇటీవల పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం గురించిన మాట్లాడిన ఆయన..కార్యలయాల ప్రాధాన్యత గురించి చెప్పారు. ఆఫీసులు కేవలం ఉద్యోగులు వచ్చిన పని చేసే చోటు కాదు, ప్రజలు, ఆలోచనలు, సంభాషణల మధ్య మెరుగైన ఫలితాలను తీసుకొచ్చే వేదికని వివరించారు. అదే సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత వరకు మెరుగైనది అనేది స్పష్టమవ్వాలంటే కనీసం మూడు నెలల పాటు వేచి ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed