వంటింటి ఆరోగ్యం

by sudharani |   ( Updated:2021-05-24 23:19:34.0  )
వంటింటి ఆరోగ్యం
X

దిశ,వెబ్ డెస్క్ : మనం రోజు వంటల్లో అనేక రకాల దినుసుల్ని ఉపయోగిస్తాం . కానీ అందరూ అనుకుంటారు వీటిని రుచికోసమే వాడుతామని కానీ .. ఇది కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు .. ఇవి మన శరీరంలో ఏ పాత్ర పోషిస్తున్నాయో చూద్దాం.

ధనియాలు(Coriander)..

ధనియాలు జీర్ణక్రియ సమస్యకు ఒక చికిత్సగా ఉంటాయి. అంతే కాకుండా ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. ధనియాలను మెత్తగా నూరి తల మీద పేస్టలా పెట్టుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి.

పసుపు(Turmeric)..

పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, కఫం, వాతం వంటి రోగాలను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వేడి నీరు లేదా పాలలో కలుపుకుని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించి.. గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వస్తుంది.

మెంతులు(Fenugreek)..

మన ఇంట్లో ఉండే మెంతులు తినడానికి రుచికరంగా లేకపోయిన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. మజ్జిగలో ఒక టీస్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగితే వంట్లో ఉన్న కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతాయి. పొట్ట ఉబ్బరించినట్లు ఉండటం, జీర్ణక్రియ సరగా లేకపోతే, మలబద్ధకంగా ఉంటే కేవలం అర టీస్పూన్ మెంతులను నానబెట్టుకుని తనటం లేదా మెంతి పప్పు, మెంతిని చపాతి రూపంలో తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇక మధుమేహ రోగులకు మెంతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయిటున్నారు వైద్యలు.

జీలకర్ర(Cumin)..

జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బసంగా ఉండటం ,అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగులతుంది. జీలకర్రలో నిమ్మరసం కలిపి సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో తింటే తల తిరగడం, కడుపులో వేడి మొదలగు పైత్యరోగాలు తగ్గుతాయి.

ఆవాలు(Mustard)..

ఆవాలు జీర్ణవ్యవస్థను వృద్ధి చేస్తాయి. పంటినొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చెటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆవాల ముద్దా, కర్పూరము కలిపి నొప్పి గా ఉన్న ప్రాతంలో రాయటం వలన నొప్పి తగ్గుతుంది. అలాగే రక్త పోటు, కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది.

Advertisement

Next Story

Most Viewed