Kishwer Merchant : ఆ హీరో రాత్రంతా గడపమన్నాడు.. నటి కామెంట్స్

by Shyam |   ( Updated:2021-05-28 07:14:07.0  )
Kishwer Merchant
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణమని తెలిపింది నటి కిశ్వర్ మెర్చంట్. హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె.. ఓ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని వివరించింది. పాపులర్ హీరో, ప్రొడ్యూసర్ తనతో రాత్రంతా గడపాలని కోరారని.. అయితే ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరించి ఇంటికి వెళ్లిపోయానని తెలిపింది. ఆ టైమ్‌లో తనతో తల్లి కూడా ఉందన్న కిశ్వర్.. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తున్నా, ఇంకా జరుగుతూనే ఉన్నాయని వివరించింది. అయితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదుర్కొన్నప్పటికీ వర్క్‌పై కాన్సంట్రేషన్ మాత్రం తగ్గలేదని చెప్పింది. అయితే సినిమాల కన్నా టీవీల ద్వారానే ఎక్కువ గుర్తింపు లభించిందని, టెలివిజన్ ఇండస్ట్రీలోనే కంఫర్ట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story