- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ: కిషోర్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అధికారికంగా నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, Ch. ఉపేంద్ర హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, మోడ్రన్ వాషింగ్ మిషన్లను రజకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.