బల్దియాపై బీజేపీ జెండా ఎగరాలి

by Shyam |
బల్దియాపై బీజేపీ జెండా ఎగరాలి
X

దిశ, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో అభివృద్ధి జరగాలంటే బల్దియా‌పై బీజేపీ జెండాను ఎగరాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశం
అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మజ్లిస్ పార్టీకి టీఆర్ఎస్ కీలు బొమ్మగా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్చి 15న ఎల్బీ స్టేడియంలో సీఏఏ‌కు మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మోత్కుపల్లి నరసింహులు, శంకర్, పాపారావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read also..

వెల్‌కమ్ టు ఇండియా : ప్రధాని మోడీ

Next Story

Most Viewed