- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రైతు సంక్షేమంలో తెలంగాణది అగ్రస్థానం’
దిశ, ఇబ్రహీంపట్నం: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని రైతుల ఖాతాల్లోకి రాష్ర్ట ప్రభుత్వం రూ.39 కోట్ల 18 లక్షలు జమ చేసిందన్నారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయరంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం తపించి, రైతును రాజును చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాడన్నారు. నియోజకవర్గ పరిధిలో మరో రెండు, మూడ్రోజుల్లో మిగిలిన రూ.16 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నియోజకవర్గంలో 826 కల్లాల నిర్మాణానికి రూ.4 కోట్లు 62 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకటిచొప్పున, ఒక్కొ వేదికను 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. రైతుబంధు పథకానికి ఈ నెల 30 వరకు చిన్న సన్నకారు రైతులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.