- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి మండిపాటు
by Shyam |
మెట్రో ట్రైన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించపోవడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను ఆహ్వానించలేదని ఆరోపించారు. కేంద్రమంత్రికి కనీస మర్యాద ఇవ్వరా అంటూ విమర్శించారు. ఇకపై కేంద్రాన్ని ఎలాంటి నిధులు అడగొద్దని మండిపడ్డారు. కాగా, జూబ్లీబస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు ఇటీవలే మెట్రో ట్రైన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిని సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు సహా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు.
Next Story