- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంగనాకు అందుకే వై కేటగిరి భద్రత: కిషన్‌రెడ్డి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: తన కుమార్తెకు కొంతమంది నుంచి బెదిరింపులు వస్తున్నందున అలాంటి వారి నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ కంగనా తండ్రి హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడంతో వై కేటగిరి భద్రత కేటాయించినట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజులుగా బాలీవుడ్ నటి కంగనా, శివసేన నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఈ గొడవ మొదలై.. ఆ తర్వాత కంగనా ఆఫీస్‌ను కూల్చే వరకు వెళ్లింది. అయితే గతంలో ఎంతోమంది సినిమా నటులు, ప్రముఖులను కూడా పలు పార్టీలు హెచ్చరించినా వారికి సెక్యూరిటీని అందించని ప్రభుత్వం.. ఇప్పుడు కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడం వెనుక కారణాలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story