16న ‘భైంసా’కు కిషన్‌రెడ్డి..

by Aamani |

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలో సర్వం కోల్పొయిన బాధితులను పరామర్శించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి ఈ నెల16న వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయన తొలిసారి నిర్మల్ జిల్లాలో అడుగు పెట్టనున్నారు. భైంసా బాధితులకు అండగా నిలవడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులను బలోపేతం చేసేందుకు పర్యటన కొనసాగనున్నట్టు సమాచారం. కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఇతర బీజేపీ సీనియర్ లీడర్లు కూడా ఆయన వెంట వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతల పర్యటన నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed