రాష్ట్రంలో యూరియా కొరత ఉంది

by  |
రాష్ట్రంలో యూరియా కొరత ఉంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిగుంటకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం యూరియా గురించి పట్టించుకోవడం లేదని కిసాన్ కాంగ్రెస్ సెల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉందని, కొరత అనుభవం ఉన్నప్పటికీ తగిన జాగ్రతలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారని అన్వేష్‌రెడ్డి తెలిపారు.

బఫర్ నిల్వలు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేశారని, వెంటనే యూరియా కొరత లేకుండా రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన సోయా విత్తనాలు మొలక రాక రైతులు నష్టపోయారని, వారికి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ‌యాక్ట్‌లు పెట్టుతామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీల మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.


Next Story

Most Viewed