- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తుగా ఓడిన చాలెంజర్స్
దిశ, వెబ్‌డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఆరవ మ్యాచ్‌లో RCB-Kings XI Punjab తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో.. కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులు చేశాడు. వన్ మ్యాన్ ఆర్మీలా నిలిచాడు. దీంతో పంజాబ్ స్కోర్ బోర్డు ఏకంగా 206లకు ఎగబాకింది.
207 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆటగాళ్లు ఆదిలోనే కుప్పకూలారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 2 పరుగుల వద్ద కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వీకెట్ కీపర్ జోష్ ఫిలిప్ కూడా 3 పరుగుల వద్దనే షమి బౌలింగ్‌లో lbwతో డకౌట్ అయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా కాట్రెల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి 4 పరుగుల వద్ద.. వ్యక్తిగత స్కోరు 1 మాత్రమే చేసి రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి చేతులెత్తేశాడు.
ఆ తర్వాత కాసేపు క్రీజులో కుదురుకున్న ఆరోన్ ఫించ్(20)ను 53 పరుగుల వద్ద రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు. దీనికి తోడు ఏబీ డివిలిలయర్స్(28) పరుగులు మాత్రమే చేసి మురుగన్ ఆశ్విన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి 57 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో కీలక బ్యాట్స్ మెన్లను కోల్పోయిన ఆర్సీబీ చతికిలపడింది. 30 పరుగులు చేసిన సుందర్ పర్వాలేదనిపించాడు.
ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లులో ఎవరు కూడా క్రీజులో కుదురుకోలేదు. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీకి ఘోర పరాజయం తప్పలేదు. 109/10 తోకముడవడంతో.. 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్లు ఆశ్విన్, రవి భిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. కాట్రెల్ రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. అటు కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో చేసి అదరగొట్టాడు.
స్కోర్ బోర్డు:
Kings XI Punjab: కేఎల్ రాహుల్ 132 నాటౌట్, మయాంక్ అగర్వాల్ (B) యుజువేంద్ర చాహల్ 26(20), నికోలస్ పూరన్ (C) ఏబీ డివిలియర్స్ (B) శివం దూబే 17(18) , మ్యాక్స్‌వెల్ (C) ఆరోన్ ఫించ్ (B) శివం దూబె 5 (6), కరుణ్ నాయర్ 15 నాటౌట్.. మొత్తం ఎక్స్‌ట్రాలు -11, టోటల్ స్కోర్206/3.
వికెట్ల పతనం: 57-1, 114-2, 128-3.
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 3-0-35-0, డెయిల్ స్టెయిన్ 4-0-57-0 నవదీప్ సైని 4-0-37-0, యూజువేంద్ర చాహల్ 4-0-25-1, వాషింగ్టన్ సుందర్ 2-0-13-0, శివం దూబే 3-0-33-2.
Royal Challengers Bangalore: దేవదత్ పాడికల్ (C) రవి బిష్ణోయి (B) కాట్రెల్ 1(2), జోష్ ఫిలిప్ LBW (B) మహ్మద్ షమి 0(3), విరాట్ కోహ్లీ (C) రవి బిష్ణోయి (B) కాట్రెల్ 1(5), ఆరోన్ ఫించ్ (B) రవి బిష్ణోయ్ 20(21), ఎబి డివిలియర్స్ (C) సర్ఫరాజ్ ఖాన్ (B) ఎం అశ్విన్ 28(18), శివం దూబే (B) మ్యాక్స్‌వెల్ 12(12), ఉమేశ్ యాదవ్ (B) రవి బిష్ణోయ్ 0(2) వాషింగ్టన్ సుందర్ (C) మయాంక్ అగర్వాల్ (B) రవి బిష్ణోయ్ 30(26), నవదీప్ సైని (B) ఎం. అశ్విన్ 6 (7), యూజువేంద్ర చాహల్ lbw (B) ఎం.ఆశ్విన్ 1(3) డెయిల్ స్టెయిన్ 1 నాటౌట్, మొత్తం ఎక్స్‌ట్రాలు 9, టోటల్ స్కోరు:109-10
వికెట్ల పతనం: 2-1, 3-2, 4-3, 53-4, 57-5, 83-6, 88-7,101-8, 106-9, 109-10.
బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 3-0-17-2, మహ్మద్ షమీ 3-0-14-1, రవి బిష్ణోయ్ 4-0-32-3,
మురుగన్ అశ్విన్ 3-0-21-3, జేమ్స్ నీషం 2-0-13-0, మ్యాక్స్‌వెల్ 2-0-10-1.