మాస్క్ పెట్టుకోమన్నందుకు.. తుపాకీతో కాల్చి చంపాడు..

by Sumithra |   ( Updated:2021-09-23 04:16:59.0  )
Gun-Fire
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా.. ఈ పదం వింటే చాలు ప్రతీ ఒక్కరూ జంకుతారు. ఎందుకంటే అది ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో కకావికలం చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే.. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని చెబుతున్నాయి. వాటిని తప్పనిసరి చేశాయి.

అందులో భాగంగా మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో ప్రతీ ఒక్కరం మాస్క్ ధరిస్తున్నాం. అయితే.. కొంతమంది మాత్రం కరోనా నిబంధనలను పక్కనపెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనే జర్మనీలో చోటు చేసుకుంది. మాస్క్ పెట్టుకోమని సూచించినందుకు ఓ వ్యక్తిని చంపేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలోని ఓ పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఎదురుగా వచ్చిన కస్టమర్‌ను.. మీరు మాస్క్ ధరించండి, కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.. మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశముంది.. మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అతనికి సూచించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం తర్వాత ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ అతను అక్కడికి వచ్చాడు. అయితే ఈసారి మాత్రం మాస్క్ ధరించాడు. అది కూడా ఏ మాత్రం ఫేస్ కనిపించకుండా మాస్క్ ధరించి వచ్చాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో ఆ క్యాషియర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆ క్యాషియర్ మృతిచెందాడు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఖాయ్ ఫుహర్మన్ అనే ప్రాసిక్యూటర్ ఈ వివరాలంన్నిటినీ మీడియాతో తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed