- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలుడి కిడ్నాప్ కలకలం.. ఆ మహిళ పనేనా ?

X
దిశ, వెబ్‌డెస్క్ : రంగా రెడ్డి జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజేంద్రనగర్ హైదర్ గూడలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అనీష్ అనే ఏడేళ్ల బాలుడు అపార్ట్‌మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం చాలా సేపు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకి దొరకక పోవడంతో.. బాలుడు కనిపిచడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన 10 ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ సమీపంలో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొనిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయినట్టు సమాచారం.
Next Story