లైఫ్ ఇచ్చిన నిర్మాతకు నో చెప్పిన కియార

by Shyam |
లైఫ్ ఇచ్చిన నిర్మాతకు నో చెప్పిన కియార
X

దిశ, సినిమా : ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌’ బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌లో కియారా అద్వానీ రేంజ్ మారిపోయింది. సినీ వన్ స్టూడియోస్ అధినేత, నిర్మాత మురాద్ ఖేతానీ ఈ చిత్రం ద్వారా బిగ్ ఆఫర్ ఇవ్వగా.. స్టార్ రేంజ్‌కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇదే బ్యానర్‌లో ‘భూల్ భులయ్యా 2’ సినిమా కూడా కమిట్ అయిన కియారాకు థర్డ్ పిక్చర్ కూడా ఆఫర్ చేశారట నిర్మాత. ‘అపూర్వ’ పేరుతో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కించాలని భావిస్తున్న ప్రొడ్యూసర్.. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఒక్క రోజు ఫిమేల్ లీడ్ లైఫ్ జర్నీని సినిమాలో చూపించబోతుండగా.. కథ నచ్చినప్పటికీ సినిమాను రిజెక్ట్ చేసిందట కియారా టీమ్. ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లను ఖాతాలో వేసుకుంటున్న కియారా.. చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తే కెరియర్‌కు మైనస్ అవుతుందనే ఉద్దేశంతో సినిమాను ఒప్పుకోలేదని సమాచారం.

Advertisement

Next Story