కియా కీలక ప్రకటన.. ఏపీలో భారీ పెట్టుబడి

by srinivas |
కియా కీలక ప్రకటన.. ఏపీలో భారీ పెట్టుబడి
X

దిశ, ఏపీ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటన చేసింది. అనంతపురం జిల్లాలో ఉన్న ప్లాంట్‌లో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ వెల్లడించారు. ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సదస్సుకు కూకున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు. కాగా, గతంలో కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతుందంటూ టీడీపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన టీడీపీని ఇబ్బంది పెట్టేదనడంలో సందేహం లేదని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed