డ్యాన్స్ Vs డ్యాన్స్.. అప్‌కమింగ్ సీజన్‌లో సౌత్ స్టార్స్

by Shyam |
డ్యాన్స్ Vs డ్యాన్స్.. అప్‌కమింగ్ సీజన్‌లో సౌత్ స్టార్స్
X

దిశ, సినిమా : తమిళ్ డ్యాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ వర్సెస్ డాన్స్’ రెండో సీజన్‌కు సౌత్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూతో పాటు స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ ఎంపికయ్యారు. తాజాగా షో టీజర్ ప్రోమో లాంచ్ చేసిన మేకర్స్.. ఈ విషయాన్ని ప్రకటించారు. నటి ఖూష్బూకు జడ్జిగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాగా, బృంద మాస్టర్ ఆల్రెడీ ఫస్ట్ సీజన్‌కు జడ్జిగా చేసింది. కాగా ఈ న్యూస్‌పై స్పందించిన ఖుష్బూ.. డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తన హృదయానికి చాలా దగ్గరైన కళ అని పేర్కొంది.

ప్రస్తుతం ‘డాన్స్ వర్సెస్ డాన్స్’లో భాగమైనందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పింది. జడ్జిగా కొత్త పాత్ర విషయానికొస్తే.. బృంద పక్కనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదని తెలిపింది. అంతేకాదు కలర్స్ తమిళ్ చానెల్‌తో అసోసియేట్ కావడం పట్ల సంతోషంగా ఉందన్న ఖుష్బూ.. ఫ్రెష్, ప్రోగ్రెసివ్ కంటెంట్‌ను అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించింది.

ఈ మేరకు బృంద మాస్టర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకుంది. సెకండ్ సీజన్ కొత్త ఫార్మాట్‌లో రాబోతోందని చెప్పింది. ఆ సంగతి పక్కనబెడితే, తనకు మంచి స్నేహితురాలైన ఖుష్బూతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story