- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో ఎక్కువ కేసులు ఇక్కడే
దిశ ప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి అంకెల్లోంచి క్రమంగా సంఖ్యల్లోకి ఆ తర్వాత ఇప్పుడు వేలల్లోకి మారిపోయింది. ఆర్ ఏటీ పరీక్షల సంఖ్య పెంచడంతో రోజూ 500లకు పైగా కేసులు నమోదమవుతున్నాయి. పరీక్షలు చేయించుకుంటున్న మొత్తం అనుమానితుల్లో 20 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడిచిన మూడు రోజులుగా రెండు జిల్లాల్లో పరీక్షల సంఖ్యను పెంచడంతో కేసులు ఊహించనంతగా పెరుగుతండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వందల్లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందేలా వైద్యులు సూచనలు చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కరోనా 5000 కేసుల మార్కును దాటేసింది.
ఇదీ ఉమ్మడి జిల్లాలో కరోనా లెక్క..
ఈనెల 21 ఖమ్మంలో1658మంది పరీక్షలు నిర్వహించగా 385మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 22న 1221మందికి పరీక్షలు నిర్వహించగా 296మందికి పాజిటివ్ కేసు బయట పడ్డాయి. తాజాగా ఆదివారం ఖమ్మంలో 1098మందికి పరీక్షలు నిర్వహించగా 232 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం 131 కేసులు నమోదయ్యాయి. ఇందులో కొత్తగూడెం డివిజన్‌లో 57, భద్రాద్రి డివిజన్ పరిధిలో 74 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 363 కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. 2549మందికి పరీక్షలు నిర్వహించగా 525మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. 177మంది సోమవారం పూర్తిగా కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా మారినట్లు పేర్కొంది.
సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 66 ఖమ్మం పట్టణానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఖమ్మం పట్టణం తర్వాత అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గ మండలాల్లో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే సోమవారం ఒక్కరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 248 కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే సింగరేణి ఏరియాల్లో ఇప్పటి వరకు 45 కరోనా కేసులు నమోదు కలుపుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 1717 కేసులకు చేరుకుంది. మొత్తంగా 5800 కేసులకు చేరుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు 70మరణాలు చోటు చేసుకున్నాయి.
పెరుగుతున్న అనుమానితులు.. పెరిగిన పరీక్షలు..
ఖమ్మం జిల్లాలోని 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగుఅర్బన్ హెల్త్ కేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్ కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత లక్షణాలతో ఈ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో జనాలు బారులు తీరుతున్నారు. వాస్తవానికి గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 300 నుంచి 400 లోపే టెస్టులు నిర్వహించేవారు. అయితే అనుమానితుల సంఖ్య పెరుగుతుండడంతో పరీక్షల సంఖ్య కూడ పెంచాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు జిల్లాల వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. నాలుగు రోజులుగా రెండు రోజుల్లో 1500 చేరువలో కేసులు నమోదుకావడం గమనార్హం. ఒక్క గురువారం రోజే ఖమ్మం జిల్లాలో 801 మందికి పరీక్షలు నిర్వహించగా, 193మందికి పాజిటివ్ వచ్చింది. ఇక శుక్రవారం ఆ టెస్టుల సంఖ్య మరింత పెంచి 1658 మందికి పరీక్షలు చేశారు. 385 మందికి పాజిటివ్ నిర్ధారణైంది.
సింగరేణి ఆసుపత్రుల్లో 46 పాజిటివ్‌లు..
ఉమ్మడిజిల్లాలోని సింగరేణి ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మణుగూరు ఏరియాలో 25, ఇల్లెందులో 11, సత్తుపల్లి 6, కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఇటీవల రుద్రంపూర్ 5 షాఫ్ట్ గనిలో పనిచేస్తున్న ఒక సీనియర్ మేనేజర్ (55) మృతి చెందారు. సింగరేణికి చెందిన ఇద్దరు ప్రధాన అధికారులు కరోనా బారిన పడి హైదరాబాద్‌లో వైద్య సేవలు పొందుతున్నారు.