అనన్య ‘కాలీ పీలీ’ ఓటీటీలోనే..

దిశ, వెబ్‌డెస్క్: నాతో మ్యాడ్ రైడ్ చేయాలని ఉందా? అయితే రెడీ అయిపోండి! అక్టోబర్ 2, డేట్ లాక్ చేసుకోండి.. అని చెప్తోంది బాలీవుడ్ ప్రెట్టీ గర్ల్ అనన్య పాండే. ఇషాన్ ఖట్టర్‌తో ‘కాలీ పీలీ’ సినిమాలో రొమాన్స్ చేసిన అనన్య.. సూపర్ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఫస్ట్ టైమ్ ఇషాన్, అనన్య కెమిస్ట్రీ స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనుండగా.. జీప్లెక్స్ ద్వారా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయగా, ప్రమోషన్స్ కూడా ఇరగదీస్తున్నారు.

సినిమాలో ఇషాన్ ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. ఓ వ్యభిచార గృహం నుంచి భారీ నగదుతో పారిపోయి వచ్చిన అమ్మాయిగా అనన్య నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి చేసే ప్రయాణంలో వారు తెలుసుకున్న నిజాలేంటి? ఇంతకీ ఈ ఇద్దరు ఒకరికొకరు ఏం అవుతారు? అనేది కథ కాగా.. ముక్బుల్ ఖాన్ దర్శకత్వం వహించారు. విశాల్ – శేఖర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై అలీ అబ్బాస్ జాఫర్, హిమన్షు మెహ్రా నిర్మించారు.

Advertisement