ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి హరీశ్ కీలక ప్రకటన

by Shyam |
Minister Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా.. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్షల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

సంగ‌మేశ్వర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 1,774 కోట్లతో నిర్మిస్తామ‌ని తెలిపారు. జ‌హీరాబాద్‌, ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని 11 మండ‌లాల‌కు సంగ‌మేశ్వర లిఫ్ట్ కింద సాగునీరు అందిస్తామ‌న్నారు. బస‌వేశ్వర లిఫ్ట్ కింద నారాయ‌ణ్‌ఖేడ్‌, ఆందోల్ నియోజ‌వ‌ర్గాల్లోని 8 మండ‌లాలు, 166 గ్రామాల‌కు సాగునీరు అందిస్తామని తెలిపారు. 8 టీంఎసీల నీటిని సింగూరు నుంచి ఎత్తిపోయిస్తామని, 2 పంప్ హౌజ్‌లు, 6 ప్రధాన కాలువ‌ల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకటి రెండు మాసాల్లోనే టెండ‌ర్ల ప్రక్రియ పూర్తి చేసి ఈ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed