దీపావళి వేళ బాణాసంచాపై GHMC కమిషనర్ కీలక ప్రకటన

by Shyam |   ( Updated:2021-10-30 01:45:39.0  )
దీపావళి వేళ బాణాసంచాపై GHMC కమిషనర్ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : రానున్న దీపావళి పండుగ దృష్ట్యా హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చేందుకు అనుమతి ఉంటుందా.? లేదా.? అన్న గందరగోళంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. నగరం చుట్టూ ఉన్న ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో భారీగా గాలి కాలుష్యం జరుగుతోంది. దీనికి తోడు భారీగా బాణాసంచా కాల్చడం ద్వారా వచ్చే పొగతో గాలి మరింత కాలుష్యం అవుతోంది.

దీంతో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. వేడుకల పేరుతో సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేవలం తక్కువ శబ్దాన్ని, తక్కువ పొగను వెదజల్లే గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే వాడేందుకు హైదరాబాద్‌లో అనుమతి ఉందని లోకేష్ కుమార్ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా నగరవాసులు కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడి కాలుష్యం తగ్గించడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed