ఏపీలో కరోనా నియంత్రణ చర్యలపై కీలక భేటీ

by srinivas |
ఏపీలో కరోనా నియంత్రణ చర్యలపై కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణ చర్యలపై వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ భవన్ మీటింగ్‌ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో వైద్యారోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో కొవిడ్‌ తాజా పరిస్థితిని ఆయనకు జవహర్‌రెడ్డి వివరించారు. కరోనా కట్టడికి చేపట్టిన కార్యక్రమాలను ఏకే సింఘాల్‌ తెలుసుకున్నారు. సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండ విజయరామరాజు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఇవో డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు.



Next Story

Most Viewed