Third wave : థర్డ్ వేవ్‌పై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కీలక ఆదేశాలు

by Shyam |   ( Updated:2021-06-02 05:08:37.0  )
Third wave : థర్డ్ వేవ్‌పై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు ప్రకటిస్తున్న నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ వేవ్ ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూసుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే పదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

చిన్నారులను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయవద్దని, పక్కింట్లో కూడా ఆడుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని సూచించింది. పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడాలు చేయవద్దని, రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లవద్దని, పాలిచ్చే తల్లులు కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొంది. విందులు, బంధువుల ఇళ్లకు ప్రయాణాలు సురక్షితం కాదని వెల్లడించింది. ఈ సమయంలో పిల్లలకు హెయిర్ కటింగ్‌కు కూడా తీసుకెళ్లవద్దని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వివరించింది. పిల్లలు ఏ మాత్రం నలతగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.

పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందించాలని సూచించింది. పిల్లలతో తరచుగా హ్యాండ్ వాష్ చేయించాలని, బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలను శుభ్రపరిచిన తర్వాతే పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరమని పేర్కొంది. ఇంట్లో తరచూ శానిటైజర్ చేయాలని కోరింది. ఈ సూచనలను అందరూ ఖచ్చితంగా పాటించాలని ఆ ప్రకటనలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కోరింది. పిల్లలు బాగుంటేనే ఆరోగ్యకర భారత్ సాధ్యమని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed