- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజీల్లోకి శ్రీశాంత్
దిశ, స్పోర్ట్స్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్న టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడనున్నాడు. వచ్చే రంజీ సీజన్‌లో శ్రీశాంత్‌ను కేరళ జట్టు తరఫున ఆడించాలని ఆ రాష్ట్ర అసోసియేషన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని 2018లో కేరళ హైకోర్టు ఎత్తేసింది. ఆతర్వాత సుప్రీంకోర్టు శిక్షను ఏడేండ్లకు కుదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి నిషేధం ముగియనుంది. వచ్చే సీజన్ నాటికి అతని ఫిట్‌నెస్ నిరూపించుకుంటే తిరిగి జట్టులోకి చేర్చుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నది. దీనిపై శ్రీశాంత్ స్పందిస్తూ నేను కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు చాలా రుణపడి ఉంటాను. తప్పకుండా నా ఫిట్‌నెన్ నిరూపించుకొని తిరిగి క్రికెట్ ఆడుతాను. నాపై వచ్చిన వివాదాలన్నింటికీ నా ఆటతోనే సమాధానం చెబుతాను అని అన్నాడు.