- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థౌజండ్ వాలా పేల్చిన స్వప్న.. చిక్కుల్లో సీఎం విజయన్
దిశ,వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఎప్రిల్ నెలలో కేరళలో 151 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంలో గోల్డ్ స్కాంలో అరెస్టైన కేరళ ప్రభుత్వ మాజీ ఐటీ విభాగం ఉద్యోగిని స్వప్న సురేష్ కేరళ సీఎం పినరయి విజయన్ పై సంచలన ఆరోపణలు చేసింది.
ఈ కేసు పూర్వపరాలను ఒక్కసారి పరిశీలిస్తే
జులై 5, 2020 న రూ.14.82 కోట్ల ఖరీదైన 30 కిలోల 24 క్యారట్ల బంగారం డిప్లమ్యాటిక్ బ్యాగ్ లో కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌లోని యుఎఇ కాన్సులేట్ కార్యాలయానికి రావడాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్ఐఏ అధికారులు యూఏఈ కాన్సులేట్ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో దుబాయ్ నుంచి కేరళకు స్మగ్లింగ్ జరుగుతుందని, అందులో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేష్, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. శివశంకర్ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. దీంతో కేరళ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ను విధులు నుంచి తొలగించగా.., కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వప్న సురేష్ ను అదుపులోకి తీసుకున్నాయి.
కేరళ సీఎం విజయన్ మెడకు గోల్డ్ స్కాం కేసు
అయితే తాజాగా కస్టమ్స్ అధికారుల విచారణలో సీఎం విజయన్ మెడకు గోల్డ్ స్కాం కేసు బిగుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్ పాత్ర ఉందంటూ నిందితురాలు స్వప్న సురేష్ సంచలన ఆరోపణలు చేసింది. దుబాయ్ నుంచి కేరళకు దౌత్యమార్గాల్లో బంగారం అక్రమ రవాణా వ్యవహారం ముఖ్యమంత్రికి తెలుసని బాంబు పేల్చింది. ఈ మేరకు ఎర్నాకుళం మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఇచ్చిన వాంగ్మూలంలో స్వప్న సురేష్ కీలక విషయాల్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. కస్టమ్స్ కమిషనర్ సుమత్ కుమార్, మాజీ యూఏఈ కౌన్సిల్ జనరల్ తో సీఎం విజయన్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ సంబంధాల ద్వారానే విదేశీ కరెన్సీ అక్రమరవాణా జరిగిందని స్వప్నసురేష్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం విజయన్ తో పాటూ స్పీకర్,మరో ముగ్గురు కేబినేట్ మంత్రులు కూడా చట్ట విరుద్దంగా నగదు లావాదేవీలు చేసినట్లు పేర్కొన్నారు.
స్వప్న సురేష్ స్టేట్మెంట్ ఆధారంగా కస్టమ్స్ అధికారులు నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను కేరళ హైకోర్ట్ కు సమర్పించారు. నివేదికపై కోర్ట్ త్వరలో విచారణ చేపట్టనుంది. అయితే తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.