- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమే గెలుస్తాం.. అయ్యప్ప, ఇతర దేవుళ్లు మాతోనే ఉన్నారు : కేరళ సీఎం
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా ధర్మదాం నియోజకవర్గం ఆర్‌సి అమలా పాఠశాలలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పై అయ్యప్ప స్వామి ఆగ్రహం ఉంటుందని ‘నాయర్ సర్వీస్ సొసైటీ చీఫ్ సుకుమారన్ నాయర్’ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ముఖ్యమంత్రి స్పందించారు.
‘అయ్యప్ప స్వామితో పాటు ఇతర దేవతలందరూ LDF(లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్)తోనే ఉన్నారని చెప్పారు. ఎందుకంటే తమ ప్రభుత్వం ప్రజలకు ప్రాముఖ్యత ఇచ్చిందని, వారికి మంచి చేసిందని గుర్తుచేశారు. అలాంటి ఎల్డీఎఫ్ పార్టీకి ప్రజల మద్దతుతో పాటు దేవుళ్ల సపోర్టు కూడా ఉంటుందన్నారు. కేరళలో మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు సీఎం పినరయి.
ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందని, ఇతర పార్టీలు సృష్టించిన అపోహలను ప్రజలు స్వీకరించలేదని వెల్లడించారు. అందుకు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలనే ఉదాహరణగా తీసుకోవచ్చునని తెలిపారు. 2016 నుంచి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏం చేసింది- అభివృద్ధితో పాటు విపత్తుల్లోనూ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారని.. వీటన్నింటినీ చూస్తే ప్రజలు ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయాన్ని అందిస్తారనడంలో సందేహం లేదని ”అని పినరయి విజయన్ స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఈరోజు జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 7గంటల వరకు 73శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది.