- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన మోడల్.. కేసు వేసిన కంపెనీ
దిశ, సినిమా: ఫేమస్ ఇటాలియన్ ఫ్యాషన్ కంపెనీ లియు జో.. అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్‌పై దావా వేసింది. రెండు ఫోటో సెషన్స్‌లో కనిపించాల్సిన జెన్నర్.. మోడలింగ్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. ఇందుకు పరిహారంగా 1.8 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కానీ మోడలింగ్ కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించారనే వాదన నిజం కాదని స్పష్టం చేశారు మోడల్ ప్రతినిధి.
మాన్హాటన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన లాసూట్‌లో.. రెండు ఫోటో షూట్‌లు ప్లాన్ చేయగా జెన్నర్ మొదటిదానిలో మాత్రమే పాల్గొందని పేర్కొంది కంపెనీ. మార్చి 2020లో షెడ్యూల్ చేయబడిన రెండో ఫొటోషూట్ కరోనా కారణంగా వాయిదా పడిందని తెలిపింది. అయితే మరో డేట్ సెట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా మోడల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం జెన్నర్‌కు 1.35 మిలియన్ డాలర్లు చెల్లించామని లాసూట్‌లో పేర్కొన్న కంపెనీ.. ఆమె నుంచి పేమెంట్స్ రికవరీ చేయలేకపోతున్నామని వివరించింది.