కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Shamantha N |   ( Updated:2021-04-26 04:28:22.0  )
కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ ఇవాళ తెలిపారు. శనివారం నుంచి ఉచిత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. కంపెనీలు వ్యాక్సిన్ ధరను రూ.150కు తగ్గించాలని సూచించారు. మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న క్రమంలో వ్యాక్సిన్ ధరలను పెంచడం సరికాదన్నారు. ఈ రోజు 1.34 కోట్ల వ్యాక్సిన్‌లకు ఆర్డర్ పెట్టామని, వ్యాక్సిన్ అందిన వెంటనే ఉచిత వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామన్నారు.

ఉచిత వ్యాక్సిన్ ప్రభుత్వ ఆస్పత్రులలోనే అందుబాటులో ఉంటుందని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్ వేయించుకునేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దేశంలోని ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ డోసు ధర ఒకేలా ఉండాలని కేజ్రీవాల్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed