కమెడియన్ వడివేలుతో జతకట్టిన కీర్తి సురేష్?

by Anukaran |
Keerthy Suresh Vadivelu
X

దిశ, సినిమా : పలు కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కోలీవుడ్ టాప్ కమెడియన్ వడివేలు కొత్త ప్రాజెక్ట్‌తో కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ‘నాయి శేఖర్ రిటర్న్స్’ వర్కింగ్ టైటిల్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహించనున్నారు. 2006లో వచ్చిన ‘తలైనగరం’ సినిమాలో వడివేలు పోషించిన ఐకానిక్ క్యారెక్టర్ ‘నాయి శేఖర్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. కొద్దిరోజుల కిందటే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్‌గా లాంచ్ చేయబడింది. ఇదిలా ఉంటే, ఈ మూవీలో వడివేలు పక్కన స్టార్ హీరోయిన్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తుందనే న్యూస్ కోలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తను వడివేలుతో రొమాంటిక్ సీన్స్‌లో నటించదని, కాకపోతే ఆమెది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

ఈ విషయం చర్చల దశలోనే ఉండగా.. కీర్తి ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన తర్వాతే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడే అవకాశం ఉంది. సాధారణంగా స్టార్ హీరోయిన్ల కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కమెడియన్స్ పక్కన నటించేందుకు సాహసించరు. మరి కీర్తి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ఇక ‘అన్నాత్తే’ మూవీలో రజనీకాంత్‌కు జంటగా కనిపించనున్న కీర్తి, తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story