పెంగ్విన్.. అవార్డు విన్ కావచ్చు?

by Anukaran |   ( Updated:2020-06-08 05:43:58.0  )
పెంగ్విన్.. అవార్డు విన్ కావచ్చు?
X

మహానటితో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ నటించిన మరో అద్భుత చిత్రం పెంగ్విన్. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కగా.. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్‌ను ఇన్‌స్పిరేషనల్ హీరోయిన్స్ త్రిష, సమంత, మంజువారియర్, తాప్సీ విడుదల చేశారు.

మాతృత్వ బలానికి సాక్ష్యమిచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ విడుదలైన పెంగ్విన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ప్రతీ ఒక్కరి కథ వెనుక అమ్మ కథ ఉంటుంది.. ఎందుకంటే మన కథ అక్కడే మొదలవుతుంది..?’ అంటూ ప్రారంభమైన టీజర్‌ ప్రశంసలు అందుకుంటోంది. ‘బిడ్డను విడిచి ఉండలేని తల్లి, కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.. ఆ చిన్నారిని ఎలా కోల్పోయింది? తల్లి పీడకల నిజమైతే ఎలా ఉంటుంది? తను ఎలా కుమిలిపోతుంది? ఆ బాధ నుంచి బయటకు వచ్చి న్యాయం కోసం ఎలా పోరాడిందనేదే’ కథ అని తెలుస్తుండగా.. ఎప్పటిలాగే కీర్తి అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో నేషనల్ అవార్డ్ కన్‌ఫర్మ్ అనేలా తన నటనతో మంత్రముగ్ధులను చేసింది. బిడ్డను కోల్పోయిన తల్లి పడే బాధకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ సినిమా ట్రైలర్ జూన్ 11న రిలీజ్ కానుండగా.. జూన్ 19న సినిమా వరల్డ్ వైడ్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=SY99XrIv0mM&feature=youtu.be

Advertisement

Next Story