సోషల్ మీడియాలో కీర్తి రికార్డ్.. మేక్ అప్ లేకుండా థాంక్స్ వీడియో

by Shyam |   ( Updated:2023-05-19 09:34:13.0  )
సోషల్ మీడియాలో కీర్తి రికార్డ్.. మేక్ అప్ లేకుండా థాంక్స్ వీడియో
X

కీర్తి సురేష్.. జాతీయ ఉత్తమనటి. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి… అతి కొద్ది కాలంలోనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో 50 లక్షల మంది ఫాలోవర్స్ ను సాధించింది. ఈ సందర్భంగా.. స్పెషల్ థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసింది.

ఇప్పుడు మనం 5 మిలియన్ ఫ్యామిలీ మెంబర్స్ అని… మీ ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపింది. పెట్ డాగ్ నైకీ తో కలిసి థాంక్స్ చెప్పిన కీర్తి.. నైకి మీ అందరినీ కలిసేందుకు ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో చూడండి అంటూ ఓ ఫోటో కూడా షేర్ చేసింది. కాగా ఈ వీడియోలో కీర్తి మేక్ అప్ లేకుండా కనిపించినా.. చాలా ప్రెట్టీగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

అంతే కాదు మెగాస్టార్ మోహన్ లాల్ పుట్టినరోజును పురస్కరించుకుని తనకు విష్ చేసిన కీర్తి.. తన చిన్నప్పుడు మోహన్ లాల్, తల్లిదండ్రుల తో కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. లాల్ అంకుల్.. ఫొటో షేరింగ్ నుంచి స్క్రీన్ షేరింగ్ వరకు మీతో ప్రయాణం చాలా ప్రత్యేకమని చెప్పింది. 60 ఏళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్న మీరు మరిన్ని గొప్ప పాత్రలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story