ఆగస్టు 15న కీర్తి ‘గుడ్‌లక్ సఖి’ టీజర్

by  |
ఆగస్టు 15న కీర్తి ‘గుడ్‌లక్ సఖి’ టీజర్
X

నేటితరం మహానటిగా ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్.. తాజాగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime)లో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో మరోసారి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, కీర్తి మాత్రం తన నటనతో మెప్పించింది. ఇదిలా ఉంటే, మరో మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది కీర్తి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’ టీజర్ డేట్ ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. కీర్తి షూటర్‌గా కనిపించనున్న ఈ సినిమా టీజర్.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15, ఉ. 10 గంటలకు విడుదల కానుంది.

నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర నిర్మిస్తున్న చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్న సినిమాలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తుండటం మరో విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి.


Next Story

Most Viewed