- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో కేంద్రానికి సంపూర్ణ మద్దతిచ్చిన కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రక్షణ, భద్రత, ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని, దేశమంతా ఒక్క తాటిపై నిలవాలని అన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన భారత జవాన్ల సంస్మరణార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజల మద్దతు కేంద్రానికి సంపూర్ణంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. చైనాగానీ, మరే ఇతర దేశంగానీ భారత సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే తప్పక ప్రతిఘటించాలని ప్రధానికి సూచించారు. అలాంటి శక్తులకు తగిన సమాధానం చెప్పాలన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, యావత్తు దేశమంతా ఒక్క తాటిపై నిలవాలన్నారు.