- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ. 5 లక్షలతో కేసీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. ఎక్కడో తెలుసా.?

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. సర్పంచ్ ఉద్దెమారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రూ. 5 లక్షల వ్యయంతో కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. తెలంగాణ గాంధీ అని చిల్పూర్ ఎంపీపీ బొమ్మశెట్టి సరిత బాలరాజు, సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన చిల్పూర్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, మాజీ సర్పంచులు బాలరాజు, రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, నాయకులు రాజ్ మహమ్మద్, షకీల్, వెంకన్న, రంగరాజు, విజయ భాస్కర్, కబడ్డీ శీను, రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Next Story