‘పట్టణ ప్రగతి పేరిట మరో మోసం’

by Ramesh Goud |
‘పట్టణ ప్రగతి పేరిట మరో మోసం’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ తన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే పట్టణ ప్రగతి పేరిట కొత్త మోసానికి తెరలేపారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పట్టణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును ఎండగట్టేందుకు.. రేపటి నుంచి ‘పట్నంగోస’ పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది వేల ఇండ్ల నిర్మాణం మాత్రమే జరిగిందనీ, 20జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు రూ.9వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. చివరకు ప్రధానమంత్రి ఆవాస యోజన నిధులనూ దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందిచట్లేదని నిలదీశారు.

Read also..

ఆ జైలు కెళ్తావా.. ఈ జైలు కెళ్తావా..?


Advertisement
Next Story

Most Viewed