- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. రైతులు ఏ పంట వేసుకోవాలో వారే నిర్ణయించుకోవాలని, పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని సూచించారు. రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. మద్ధతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని సీఎం పేర్కొన్నారు.
కొనుగోళ్లు బంద్ చేయాలి
గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లను బంద్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, రైతులకు కల్తీలేని ఎరువులు, పురుగుల మందులను అందించాలన్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు.
Next Story